అక్షయ్ కుమార్ ఫస్ట్ డబుల్ సెంచరీ

0
4003

బాలీవుడ్ లో ప్రతిసారి తన సినిమాలతో మంచి సందేశంతో పాటు నిర్మాతలకు బయ్యర్లకు మంచి లాభాలను అందిస్తున్న హీరో అక్షయ్ కుమార్. సీజన్ ఏదైనా కాన్సెప్ట్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ ఈ సారి మిషన్ మాంగళ్ సినిమాతో సరికొత్త రికార్డును అందుకున్నాడు. కెరీర్ లో మొదటి సారి అక్షయ్ సినిమా 200కోట్ల క్లబ్ లో చేరింది.

ఇండిపెండెన్స్ డే సందర్బంగా వచ్చిన అక్షయ్ ఫిల్మ్ డబుల్ సెంచరి అందుకుంటుందని ఎవరు ఊహించలేకపోయారు. అక్షయ్ గతంలో తన సినిమాలతో ఈజీగానే 150కోట్ల మార్క్ ని దాటినప్పటికీ 200కోట్లను అందుకోలేకపోయారు. ఫైనల్ గా ఇటీవల మెషిన్ మంగళ్ చిత్రం పాజిటివ్ టాక్ తో ఆ మార్క్ ను దాటేసింది. ఇక నెక్స్ట్ ఈ స్టార్ హీరో మరో నాలుగు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో రెడీ అవుతున్నాడు. ఆ సినిమాలు ఏ స్థాయిలో రికార్డులను అందుకుంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here