నాని`స్ గ్యాంగ్‌లీడ‌ర్‌ రివ్యూ

0
14866

చిత్రం:  నాని`స్ గ్యాంగ్‌లీడ‌ర్‌
సెన్సార్‌:  యు/ఎ
వ్య‌వ‌థి: 157.26 నిమిషాలు
బ్యాన‌ర్‌:  మైత్రీ మూవీ మేక‌ర్స్‌
తారాగ‌ణం:నాని, ప్రియాంక‌, కార్తికేయ గుమ్మ‌కొండ‌, ల‌క్ష్మీ, శ‌రణ్య, శ్రియారెడ్డి, ప్రాణ్య‌, అనీష్ కురువిల్లా, వెన్నెల కిషోర్‌, స‌త్య‌, ర‌ఘుబాబు, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు
బ్యాన‌ర్‌:  మైత్రీ మూవీ మేక‌ర్స్‌
మాట‌లు:  వెంకీ
ర‌చ‌నా స‌హ‌కారం:  ముకుంద్ పాండే
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  రాజీవ‌న్‌
మ్యూజిక్‌: అనిరుధ్‌
సినిమాటోగ్ర‌ఫీ:  మిరోస్లా కుబా బ్రోజెక్‌
నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం)
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

`అష్టాచ‌మ్మా`తో హీరోగా కెరీర్‌ను స్టార్ చేసిన నాని వ‌రుస విజయాల‌తో త‌నకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకుని నేచుర‌ల్ స్టార్ నానిగా ఎదిగారు. ఈ ఏడాదిలో `జెర్సీ` వంటి ఎమోష‌న‌ల్ హిట్‌ను సాధించిన నాని.. ఇప్పుడు డిఫ‌రెంట్ రివేంజ్ ఫ్యామిలీ డ్రామా `నాని`స్ గ్యాంగ్‌లీడ‌ర్‌`తో మ‌న ముందుకు వ‌చ్చారు. విక్ర‌మ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌, ప్రోమోలు, పాట‌లు చూస్తే నాని, ల‌క్ష్మీ, శ‌రణ్య‌, ప్రియాంక స‌హా ఇత‌ర పాత్ర‌లు వాటి చిత్రీక‌ర‌ణ అన్నీ సినిమా కామెడీగా సాగే ఓ డిఫ‌రెంట్ రివేంజ్ డ్రామా అని రివీల్ చేశాయి. అలాగే పెన్సిల్ పార్థ‌సార‌థి అనే డ‌బ్బింగ్ రైట‌ర్ పాత్ర‌లో నాని క‌నిపించ‌బోతున్నార‌ని అర్థ‌మైంది. అస‌లు నాని ఎలా ఎంట‌ర్‌టైన్ చేశారు?  సినిమాలో రివేంజ్ ఏంటి? ల‌వ్ ట్రాక్ ఎలా ఉంది?  కార్తికేయ పాత్ర ఆక‌ట్టుకుందా?  లేదా?  అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

క‌థ‌:
సిటీలో పెద్ద బ్యాంకులో పెద్ద చోరీ జ‌రుగుతుంది. ఆరుగురు వ్య‌క్తులు చోరీకి వ‌స్తారు. 300 కోట్ల రూపాయ‌ల‌ను కొట్టేసి పారిపోతున్న‌ప్పుడు ఆరో వ్య‌క్తి మిగిలిన ఐదు మందిని చంపేసి..  అక్క‌డే  ఉన్న మ‌రో ముస‌లి వ్య‌క్తిని కూడా చంపేస్తాడు. ఐదు మందిని చంపిన ఆరో వ్య‌క్తిని పోలీసులు ప‌ట్టుకోలేక‌పోతారు. అదే స‌మ‌యంలో స‌ర‌స్వ‌తి అనే పెద్దావిడ‌(ల‌క్ష్మి) త‌న కొడుకుని బ్యాంకు రాబ‌రీలో చంపేసిన ఆరో వ్య‌క్తిని ప‌ట్టుకోవ‌డానికి చనిపోయిన మిగిలిన న‌లుగురు మ‌హిళ‌ల సాయం కోరుతుంది. ఐదు మందిలో ఓ ముస‌లావిడ‌, ఓ మ‌ధ్య‌వ‌య‌స్కురాలు, పెళ్లి కావాల్సిన అమ్మాయి, కాలేజ్ చదివే అమ్మాయి, స్కూలు కెళ్లే అమ్మాయి ఉంటారు. వీరు హాలీవుడ్ రివేంజ్ సినిమాల‌ను తెలుగులోకి త‌ర్జుమా చేసే రైట‌ర్ పెన్సిల్ పార్థ‌సార‌థి(నాని) సాయం కోరుతారు. ముందు అంగీక‌రించ‌ని పెన్సిల్ ప్రియ‌ను చూసి ఒప్పుకుంటాడు. అస‌లు పెన్సిల్ రివేంజ్‌లో స‌పోర్ట్ ఒప్పుకోవ‌డానికి ప్రియే కార‌ణ‌మా?  దేవ్ ఎవ‌రు?  అత‌నికి, బ్యాంకు దోపీడికి సంబంధం ఏమిటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:
నేచుర‌ల్ స్టార్ మ‌రోసారి త‌న‌దైన నేచుర‌ల్ పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. పెన్సిల్ పార్థ‌సార‌థి అనే సినిమాల డ‌బ్బింగ్ రైట‌ర్‌గా పాత్ర‌లో ఒదిగిపో్యాడు నాని. ఆ పాత్ర‌కు త‌ను త‌ప్ప మ‌రేవ‌రూ న్యాయం చేయ‌లేరేమో అనేంత‌గా పాత్ర‌లో సూట్ అయ్యారు. అలాగే అనాథ‌ల పెరిగిన పెన్సిల్ రివేంజ్ కోసం వ‌చ్చిన ఐదుగురితో ఓ కుటుంబంలా క‌లిసి పోతాడు. వారితో ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయిపోయి.. వారిని కాపాడుకునే స‌న్నివేశాల్లోనూ నాని చ‌క్క‌గా న‌టించారు. విల‌న్‌గా కార్తికేయ చాలా బాగా చేశాడు. స్టైలిష్‌గా, మాస్‌గా రేస‌ర్ పాత్ర‌లో ఇమిడిపోయాడు కార్తికేయ‌, ప్రియాంక పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ లేక‌పోయినా పాత్ర‌కు ఆమె త‌న‌దైన న‌ట‌న‌తో న్యాయం చేసింది. ల‌క్ష్మి, శ‌రణ్య‌, ఇద్ద‌రు అమ్మాయిలు చక్క‌గా న‌టించారు.

సాంకేతికంగా చూస్తే విక్ర‌మ్ కుమార్ డిఫ‌రెంట్ స్టోరీను తెర‌పై ఆవిష్క‌రించారు. సాధారణంగా ఎవ‌రైనా రివేంజ్ అంటే ఇప్ప‌టి వ‌ర‌కు జెంట్స్‌ను మాత్ర‌మే చూసుంటాం. కానీ ఈసారి కొత్త‌గా లేడీస్‌ను పెట్టి విక్ర‌మ్‌కుమార్ రివేంజ్ డ్రామ‌ను తెర‌కెక్కించారు. ఐదుగురు లేడీస్‌లో ఏజ్‌ల‌కు త‌గిట‌న‌ట్లు న‌టీన‌టుల‌ను చ‌క్క‌గా ఎంపిక చేసుకున్నారు. విల‌న్ పాత్ర‌ను ప‌వ‌ర్‌ఫుల్‌గా డిజైన్ చేసుకున్నారు. అనిరుధ్ చ‌క్క‌టి సంగీతం అందించారు. హోయ‌నా సాంగ్‌, నిన్ను చూసే ఆనందంలో.. అనే పాట‌లు బావున్నాయి. నేప‌థ్య సంగీతం బావుంది. మిరోస్లా కుబా బ్రోజెక్ కెమెరా వ‌ర్క్ బావుంది. మూడ్‌ను ఎలివేట్ చేస్తూ సాగే సంగీతం ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణ విలువ‌లు చ‌క్క‌గా ఉన్నాయి. సందర్భానుగుణంగా వెంకీ అందించిన మాట‌లు బావున్నాయి.

చివ‌ర‌గా.. `నాని`స్ గ్యాంగ్ లీడ‌ర్‌` ఎంట‌ర్‌టైనింగ్‌గా, ఆస‌క్తిక‌రంగా సాగే రివేంజ్ డ్రామా
రేటింగ్‌: 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here