తన సినిమాల్లో హీరోయిన్ పేరు గురించి క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ విక్రమ్

0
2809

13బి సినిమా నుంచి చూసుకుంటే దర్శకుడు విక్రమ్ కె కుమార్ తన ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు. మెయిన్ గా స్క్రీన్ ప్లే తో మంచి కిక్కిచ్చే విక్రమ్ తన మేకింగ్ లో ఎన్ని మార్పులు చేస్తున్నా ఒక్క విషయంలో మాత్రం ఒకే విషయాన్ని ఫాలో అవుతున్నాడు. అదే హీరోయిన్ నేమ్. ఇష్క్ – మనం – 24 – హలో సినిమాల్లో హీరోయిన్స్ పేరు ప్రియా.

ఇప్పుడు గ్యాంగ్ లీడర్ లో కూడా కొత్త హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ కూడా ప్రియాగా కనిపించబోతోంది. అయితే ఈ విషయంపై ఫైనల్ గా దర్శకుడు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు. “నేను మొదట కథ రాసుకునేటప్పుడు న్యాచురల్ గా ప్రియా అని ఒక నేమ్ సెట్ చేసుకుంటా. ఒక కారణం వల్ల ఆ నేమ్ నాకు చాలా క్యూట్ అండ్ స్వీట్ గా అనిపిస్తుంది. సౌండ్ చాలా బాగుంటుంది. అది నాకు చాలా పర్సనల్. ఆ నేమ్ డీప్ గా కనెక్ట్ అవ్వడం వల్లే అలా నేమ్ ఇష్టంతో సెలెక్ట్ చేసుకున్నా” అని విక్రమ్ వివరణ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here