అవతార్ దర్శకుడి భయాన్ని పోగొట్టిన అవెంజర్స్

0
880

హాలీవుడ్ లొనే కాకుండా వరల్డ్ వైడ్ గా అత్యధిక కలెక్షన్స్ అందించిన టాప్ చిత్రాల్లో టైటానిక్ (1997), అవతార్(2009) మొన్నటివరకు మొదటి రెండు స్థానాల్లో కొనసాగాయి. రెండు దశాబ్దాలుగా $2.7 బిలియన్స్ కి పైగా బాక్స్ ఆఫీస్ రికార్డుల కలెక్షన్స్ అందుకున్న రారాజుగా ఆ చిత్రాల దర్శకుడు జేమ్స్ కెమెరున్ కొనసాగుతున్నాడు. అయితే ఫైనల్ గా ఇటీవల అవెంజర్స్ : ఎండ్ గేమ్ దర్శకులు అంథోని రుసో – జో రుసో ఆ రికార్డ్ ని బ్రేక్ చేశారు.

వరల్డ్ నెంబర్ వన్ పొజిషన్ లో అత్యదికంగా $2.798 గ్రాస్ కలెక్షన్స్ తో అవతార్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. దీంతో దర్శకుడు జేమ్స్ కెమెరున్ ఈ విషయంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇటీవల ఒక ఈవెంట్ లో తన భయాన్ని అవెంజర్స్: ఎండ్ గేమ్ పోగొట్టిందని చెప్పారు. “జనాలు థియేటర్స్ కి వచ్చి మరి సినిమాలు చూసే అవకాశం సన్నగిల్లిపోతుంది అనుకున్నా. అవతార్ 2,3,4 చిత్రాల్ని తెరకెక్కిస్తున్నపుడు కొంత భయం కలిగింది. అయితే ఆడియెన్స్ ఇంకా ఒక డార్క్ థియేటర్ లో విజువల్స్ ని ఎంజాయ్ చేస్తున్నారని అవెంజర్స్ నిరూపించింది. ఓ విధంగా నా భయం పోయింది” అని జేమ్స్ కెమెరున్ ఎవరు ఊహించని విదంగా ఆ రికార్డుపై స్పందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here