మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమాని మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వారి సెకండ్ వెంచర్ గా రూపొందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తరువాత సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తొలితరం రేనాటి స్వాతంత్రోద్యమ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈనెల 18వ తేదీన హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నట్లు సినిమా యూనిట్ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ వేడుకకి మినిస్టర్ కేటీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ, సెన్సషనల్ డైరెక్టర్ వి వి వినాయక్ అతిధులుగా రానున్నారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, రవికిషన్, జగపతి బాబు తదితర దిగ్గజ నటులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు……!!


