సూపర్ స్టార్ మహేష్ బాబు, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి నటవారసత్వంతో చిన్నతనంలోనే నటనలోకి ప్రవేశించారు. అప్పట్లోనే తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను మెప్పించిన సూపర్ స్టార్, ఆ సమయంలో కృష్ణ గారు మరియు విజయశాంతి గారి కాంబినేషన్లో వచ్చిన కొడుకు దిద్దిన కాపురంలో డ్యూయల్ రోల్ పోషించారు.
‘1989లో విజయశాంతి గారితో కలిసి పని చేశాను, మళ్ళి 30 ఏళ్ల తరువాత వారితో కలిసి ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తుండడం చూస్తుంటే, జీవితం అనేది ఒక సర్కిల్ గా ఎలా తిరుగుతుందో అర్ధం అవుతుంది అంటూ విజయశాంతి గారితో కలిసి కొడుకు దిద్దిన కాపురం సినిమాలోని ఒక ఫోటోని షేర్ చేస్తూ, తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు మహేష్.


