గోవాలో బిజీగా ఉన్న డిస్కోరాజా

0
682

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం డిస్కో రాజా సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు విఐ.ఆనంద్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల గోవాలో మొదలైంది. రీసెంట్ గా షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన రవితేజ మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ లో బిజీ అయ్యాడు. గోవా లోని పరిసర ప్రాంతాల్లో కీలకమైన కొన్ని ఎపిసోడ్స్ ని షూట్ చేస్తున్నారు. సినిమాలో ఈ సీన్స్ హైలెట్ అని తెలుస్తోంది.

వీలైనంత త్వరగా ఈ షెడ్యూల్ ని పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ పనులకు కూడా చిత్ర యూనిట్ ఎండ్ కార్డ్ పెట్టాలని ప్లాన్ చేసుకుంటోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరక్కుతున్న డిస్కో రాజా లో రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని సమాచారం. ఇక నభా నటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా పాయల్ రాజ్ పూత్ ప్రధాన కథానాయికగా కనిపించనుంది. క్రిస్మస్ కనుకగా డిస్కో రాజా గ్రాండ్ గా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here