సొట్టబుగ్గల సుందరి తాప్సి పన్ను ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. ఇక రూమర్స్ కి తావివ్వకుండా ఈ ముంబై భామ తన ప్రేమ విషయాన్నీ బయటపెట్టేసింది. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని డైరెక్ట్ గా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్టర్ పర్ఫెక్ట్ గర్ల్ పేరు చెప్పకుండా కుండ బద్దలు కొట్టేసింది. రీసెంట్ తాప్సి తన సోదరి షగున్ తో కలిసి ఒక వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.
అయితే అందులో తన లవ్ స్టోరీ గురించి క్లుప్తంగా వివరించింది. ‘నాకు నచ్చిన వ్యక్తి ఎలాంటి సెలబ్రెటీ కాదు. యాక్టర్, క్రికెట్ రంగానికి చెందినవాడు అసలే కాదు. అతను ప్రస్తుతం ఈ చుట్టుపక్కల లేడు’ అని తాప్సి తన బాయ్ ఫ్రెండ్ గురించి వివరణ ఇచ్చింది. అయితే వీరి ప్రేమకు ప్రధాన కారణం నేనే అని తాప్సి సోదరి ఆ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అలాగే తాప్సి అతన్ని ఎందుకు ఇష్టపడిందో తనకు ఇంకా అర్ధం కావడం లేదని చెప్పిన షగున్.. ఏదేమైనా వారు నా వళ్లే కలిశారు కాబట్టి థ్యాంక్స్ చెప్పి తీరాలని అన్నారు.