విజ‌య్ `బిగిల్‌`.. తెలుగులో బిగ్ రిలీజ్

0
746
Bigil In Telugu

థలపతి విజయ్ నటిస్తున్న బిగిల్ సినిమా తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అదిరింది (మెర్శల్) – సర్కార్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి సక్సెస్ అందుకున్న విజయ్ తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ ని అందుకున్నాడు. దీంతో అదే క్రేజ్ తో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న బిగిల్ సినిమా కూడా తెలుగులో రిలీజ్ కాబోతోంది.

`రాజా రాణి` ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా `బిగిల్‌`. ఇది వ‌ర‌కు ఈ హిట్ కాంబినేష‌న్‌లో విడుద‌లైన `తెరి`(పోలీస్‌), `మెర్స‌ల్‌`(అదిరింది) చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరి క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ చిత్రంగా `బిగిల్‌` ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ఈ సినిమాను ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్భ‌గా తెలుగు, త‌మిళంలో సినిమాను ఏక కాలంలో విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా

నిర్మాత మ‌హేశ్ కొనేరు మాట్లాడుతూ – “`బిగిల్‌` సినిమా హ‌క్కులు మా ఈస్ట్ కోస్ట్ బ్యాన‌ర్‌కు ద‌క్క‌డం చాలా ఆనందంగా ఉంది. నిర్మాత క‌ల్పాతి అఘోరామ్‌గారికి, హీరో విజ‌య్‌గారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. `118`తో మా బ్యాన‌ర్‌లో సూప‌ర్‌హిట్ సాధించాం. అలాగే జాతీయ ఉత్త‌మ‌న‌టి కీర్తిసురేశ్‌తో `మిస్ ఇండియా` సినిమాను నిర్మిస్తున్నాం. ఈ నేప‌థ్యంలో మా బ్యాన‌ర్‌లో విజ‌య్, అట్లీ క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. ఈ ఏడాది రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో ఇదొక‌టి. హీరో విజ‌య్‌గారి కెరీర్‌లో భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది. స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. త్వ‌ర‌లోనే  తెలుగు టైటిల్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం“ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here