పవన్ కళ్యాణ్ చిన్నప్పటి ఫోటోని షేర్ చేసిన నిర్మాత రామ్ తాళ్లూరి….!!

0
1169

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మరియు ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరికి మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఇటీవల రవితేజ తో ఆయన నిర్మించిన నేల టిక్కెట్ ఆడియో లాంచ్ కు పవర్ స్టార్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి, ఆ వేడుకను మరింత జయప్రదం చేయడం జరిగింది.

ఇక నేడు పవన్ చిన్ననాటి ఒక ఫోటోను రామ్ తాళ్లూరి తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ, ఈ ఫొటోలో ఉన్నదీ ఎవరో గుర్తుపట్టారా అంటూ పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఆ ఫోటోను పలువురు పవర్ స్టార్ ఫ్యాన్స్ అమితానందంతో షేర్స్, లైక్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here