భారత దేశ మొట్టమొదటి ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే . భారీ బడ్జెట్ తో రెడీ చేసిన ఈ హిస్టారికల్ కథ ఆడియెన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? అనే విషయంపై దర్శకుడు సురేందర్ రెడ్డి స్పందించారు,
“అలాగే బాక్స్ ఆఫీస్ ప్రెజర్ కూడా గట్టిగానే ఉందని కాకపోతే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది . బ్రిటిష్ రాజ్యాలకు ఎదురుతిరిగిన మొట్టమొదటి ఫ్రీడమ్ ఫైటర్ కావున సినిమాలో ఎమోషన్ ప్రతి ఒక్క భారతీయుడికి నచ్చుతుంది, ఇదొక పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ మూవీ అని చెప్పవచ్చు. బాలీవుడ్ ఆడియెన్స్ కూడా సైరాను ఎలా రిసివ్ చేసుకుంటారనే విషయం కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఫైనల్ గా సినిమా రిలీజ్ అయ్యేవరకు ఒత్తిడి తగ్గేలా లేదు” అని సురేందర్ రెడ్డి తెలిపారు.