షూటింగ్ లో భాగంగా సాయి పల్లవి ఇటీవల వరంగల్ లో అడుగుపెట్టింది. ఫిదా సినిమాలో తెలంగాణ మాస్ పిల్లగా అలరించిన సాయి పల్లవి అంటే ఎవరైనా గుర్తు పడతారు. కానీ వరంగల్ లోని పరకాల బస్టాప్ లో కూర్చొని ఉన్న సాయి పల్లవిని ఎవరు గుర్తుపట్టలేదు. కాదు కాదు ..ఎవరు గుర్తు పట్టకుండా సాయి పల్లవి అలా దర్శనమిచ్చింది. అనుమానం వచ్చి ఒక వ్యక్తి తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలు మ్యాటర్ లోకి వెళితే.. సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో విరటపర్వం అనే సినిమా చేస్తోంది. నీధి నాది ఒకే కథ దర్శకుడు వేణు ఉడుగుల సినిమా తెరకెక్కిస్తున్నాడు. చిత్ర యూనిట్ ఇటీవల వరంగల్ లో ఒక షెడ్యూల్ ని స్టార్ట్ చేసింది. అయితే అందులో ఒక సీన్ న్యాచురల్ గా ఉండేందుకు పెద్దగా మేకప్ లేకుండా సింపుల్ గా పల్లెటూరి అమ్మాయిలా సాయి పల్లవి కనిపించింది. బస్ స్టాప్ లో కూర్చొని బస్ రాగానే ఎక్కింది. చిత్ర యూనిట్ ఎవరికి కనిపించకుండా కెమెరాను ఫిక్స్ చేసి సీన్ ని షూట్ చేశారు. ఒక హీరోయిన్ తమ మధ్యలోనే ఉందని అక్కడ షూటింగ్ జరుగుతోందని ఎవరు గుర్తుపట్టలేకపోయారు.


