చంద్రాయన్ 2 కోసం ఎంతో కష్టపడి చివరికి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న ఇస్రో శాస్త్ర వేత్తలకు దేశమంతా మద్దతుగా నిలుస్తోంది. వారి కృషి మరవలేనిదని ఇది ముగింపు కాదని సెలబ్రెటీలు కూడా వారి సపోర్ట్ ను అందిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన మద్దతు ప్రకటించారు.
“విజయం ఒక గమ్యం కాదు, ఇది ఒక ప్రయాణం, ఇస్రోకు చంద్రయాన్ 2 తో చారిత్రక ప్రయాణం ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ప్రతి శాస్త్రవేత్తకు నేను సెల్యూట్ చేస్తున్నాను- మీరు మా నిజమైన హీరోలు & మేము మీతో ఉన్నాము. ఇది మీ విజయ కథకు ప్రారంభం మాత్రమే. వెళ్ళడానికి ఒక మార్గం” అంటూ మహేష్ ట్వీట్ చేశారు. ఇక చంద్రయాన్ 2లో సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న సమయంలో చివరికి కమ్యూనికేషన్ కట్ అయ్యింది. చంద్రుడికి 2.1 కిమీ దూరంలో ఇస్రోకు, విక్రమ్ ల్యాండర్ కు కమ్యూనికేషన్ కట్ అయింది. దీంతో శాస్త్రవేత్తలు నిరాశకు లోనయ్యారు.


