వర్క్ లో ఎంత బిజీగా ఉన్న పర్సనల్ లైఫ్ లో జరిగే ఈవెంట్స్ కి స్టైలిష్ స్టార్ హాజరవుతారు. ఇక గణేష్ ఉత్సవాల్లో కూడా బన్నీ పాల్గొన్నాడు. గణపతి బప్పా మోరియా అంటూ తన కుటుంబ సభ్యులతో గణేష్ నిమర్జన వేడుకలను ముగించాడు.
గీత ఆర్ట్స్ ఆఫీస్ లో ఎప్పటిలానే గణేష్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో వేడుకలో పాల్గొని అందరిని ఆకర్షించారు. అందుకు సంబంధించిన ఫొటోలు స్టైలిష్ స్టార్ అభిమానులను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. వేడుకలో అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం బన్నీ గీత ఆర్ట్స్ – హారిక హాసిని ప్రొడక్షన్ కలయికలో ‘అల వైకుంఠపురములో..’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది.


