పూజ హెగ్డేపై 2 మిలియన్ల ప్రేమ

0
648

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న బ్యూటీ పూజా హెగ్డే. సూపర్ స్టార్ మహర్షి సినిమా అనంతరం పూజ కు క్రేజ్ గట్టిగానే పెరిగింది. ఇక యంగ్ టైగర్ తో అరవింద సమేత లో తనదైన డిఫరెంట్ నటనను కనబరిచి మరింతగా పాపులర్ అయ్యింది. ఫైనల్ గా ప్రభాస్, అల్లు అర్జున్ లతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. మరికొన్ని రోజుల్లో మెగా హీరో వాల్మీకి సినిమా ద్వారా తెరపై కనిపించనుంది.

ఇంత మంది స్టార్ హీరోలతో నటించిన తరువాత ఆ హీరోల హార్డ్ కొర్ ఫ్యాన్స్ ఎలా ఉరుకుంటారు. వెంటనే  ట్విట్టర్ లో ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఆ సంఖ్య ఇప్పుడు 20 లక్షలు దాటింది. అందుకు తన ఫాలోవర్స్ కి కృతజ్ఞతలు చెబుతూ 2 మిలియన్ల ప్రేమకు చాలా సంతోషిస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం పూజ హెగ్డే త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీ హీరోగా నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమాతో బిజీగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here