అలా డబ్బు విలువ తెలిసింది

0
570

దుబారా ఖర్చులు అంటే మనసు ఒప్పుకోదని తనకు డబ్బు విలువ తెలిసేలా అమ్మా నాన్న పెంచినట్లు నాగ చైతన్య తన జీవితంలో నేర్చుకున్న ఒక చిన్న పాఠం గురించి చెప్పాడు.
సంపన్నుల కుటుంబాల్లో పెరిగిన పిల్లలకు డబ్బు విలువ ఎంతవరకు తెలుస్తుంది అనే మాటకు నాగ చైతన్య తనదైన శైలిలో ఆన్సర్ చెప్పాడు.

“బార్న్ విత్ గోల్డెన్ స్పునే అయినా అమ్మా నాన్నలు నన్ను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలా పెంచారు. గారాబం చేస్తూ అడిగినంత డబ్బు అస్సలు ఇచ్చేవారు కాదు. ఏదైనా కావాలని అడిగినప్పుడు ఎంత బ్రతిమాలినా అంత ఈజీగా వచ్చేది కాదు. అవసరం అయితేనే కొనేవారు. ఖరీదైన కాస్ట్లీ లైఫ్ ఉండేది. కాదు న్యాచురల్ గానే ఉండడం నాకు అలవాటైంది. చాలా సార్లు డబ్బు సంపాదించడం చాలా కష్టమైంది అని అమ్మ చెప్పేది. నా దగ్గర ఎన్ని కోట్లున్నా అవసరం అనుకున్న దానికోసమే ఖర్చు పెడతా. అమ్మా నాన్నల వల్లే డబ్బు విలువ తెలుసుకున్నా. సినిమా విషయంలో కూడా డబ్బు వృధాగా పోతుంటే మనసు ఒప్పుకోదు. అన్నపూర్ణ బ్యానర్ లో ప్రొడక్షన్ బాధ్యతలు చాలా సార్లు తీసుకున్నా. ఇక సింపుల్ గా డబ్బు విలువ తెలిసేలా నా పిల్లల్ని పెంచుతా” అని నాగ చైతన్య వివరణ ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here