రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సాహో. ఇటీవల విపరీతమైన అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, మంచి టాక్ సంపాదించి అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. అద్భుతమైన విజువల్స్ తో, ఆకట్టుకునే కథ, కథనాలతో ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ నటన, హోలీవుడ్ రేంజ్ ఛేజింగ్ మరియు యాక్షన్ సన్నివేశాలతో థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు థ్రిల్ అవుతున్నారని అంటున్నారు విశ్లేషకులు. రెబల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను, భారీ వ్యయంతో మరియు అత్యున్నత సాంకేతిక ప్రాణాలతో తెరక్కించారు యువి క్రియేషన్స్ సంస్థ నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్.
ఇండియాలోనే అతి పెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షాకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. కాగా సినిమాలో అక్కడడక్కడ వినిపించే బ్యాంగ్ బ్యాంగ్ అనే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడంతో, కాసేపటి క్రితం ఆ సాంగ్ వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సాహో మూవీ యూనిట్. సినిమాలోని థ్రిల్లింగ్ సన్నివేశాల మేళవింపుగా రూపొందించబడిన ఈ సాంగ్, ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది….!!


