శ్రీదేవి పాట.. ఇలియానా రీమిక్స్

0
819

అతిలోక సుందరి శ్రీదేవి నటించిన గోల్డెన్ హిట్స్ సాంగ్స్ పై బాలీవుడ్ ఇటీవల స్పెషల్ ఫోకస్ పెట్టింది. త్వరలో ఇలియాన కూడా శ్రీదేవీ ఓల్డ్ సాంగ్ లో సరికొత్తగా కనిపించనుందట. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇలియానా లుక్ విషయంలో కూడా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. బాలీవుడ్ దర్శకుడు అనీజ్‌ బజ్మీ తెరకెక్కిస్తున్న పాగల్‌ పంతీ సినిమాలో రెండు పాత పాటల్ని రీమిక్స్ చేయాలని అనుకుంటున్నారు. జాన్‌ అబ్రహాం, ఇలియానా, అనిల్‌ కపూర్‌ సినిమాలో నటిస్తున్నారు. 1989లో శ్రీదేవి – సన్నీ డియోల్ నటించిన చాల్‌బాజ్‌ లోని ‘తేరా బీమార్‌ మేరా దిల్‌..’ అనే రొమాంటిక్ సాంగ్ ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అయితే అదే సాంగ్ ని ఇప్పుడు ఇలియానా – జాన్ అబ్రహాం ల మధ్య రీమిక్స్ చేయడానికి పాగల్‌ పంతీ గ్యాంగ్ సిద్ధమవుతోంది. అయితే ఇంకా రెండవ రీమిక్స్ సాంగ్ గురించి చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ సినిమా నవంబర్ 8న విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here