దీపావళి కి దళపతి విజయ్ బిగిల్

0
670

దళపతి విజయ్ హీరోగా ‘తెరి’, ‘మెర్సల్‌’ తరువాత యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాట్రిక్‌ చిత్రం బిగిల్‌. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్‌ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, యోగిబాబు, ‘పరియేరుం పెరుమాల్‌’ ఫేం కదిర్‌, వివేక్, జాకీష్రాఫ్, డానియెల్ బాలాజీ, ఆనంద్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆసక్తికరమైన స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ఫస్ట్ లుక్ ని విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల రిలీజ్ చేసారు.

విజయ్ రెండు లుక్స్‌ లో ఉన్న పోస్టర్ విడుదల చేసి ఆయన అభిమానుల్లో సంబరాలు నింపారు చిత్ర యూనిట్. అయితే అందులో ఒక‌టి లోకల్ డాన్ పాత్ర కాగా, మ‌రొక‌టి ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ పాత్ర అని తెలుస్తుంది. ఏఆర్ రెహ‌మాన్ సంగీత సారథ్యంలో స్వరపరచిన ‘సింగపెన్నే’ అనే సింగిల్‌ ట్రాక్‌ను ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేయాగా, ఆ పాటకు శ్రోతల నుండి విశేషమైన స్పందన లభించింది. ఇకపోతే ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు, సినిమా యూనిట్ ఒక పోస్టర్ తోపాటు ప్రకటనను రిలీజ్ చేయడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here