థాయిల్యాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న NBK 105

0
966

నందమూరి బాలకృష్ణ ఇటీవల తన కొత్త లుక్ తో అభిమానులకు సరికొత్త కిక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మునుపెన్నడు కనిపించని విధంగా స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చిన బాలయ్యను బిగ్ స్క్రీన్ పై ఎప్పుడు చూస్తామా? అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం బాలయ్య ఒక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ కథతో సిద్దమవుతున్నాడు.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్ ఇటీవల ఒక ముఖ్యమైన షెడ్యూల్ కోసం థాయిల్యాండ్ వెళ్లింది. అయితే అనుకున్న సమయానికి బాలకృష్ణ ఈ కీ షెడ్యూల్ ని పూర్తి చేశారు. కొంత గ్యాప్ తీసుకొని మరో షెడ్యూల్ ని ఇండియాలోనే మొదలుపెట్టనున్నారు. ఇక సినిమాలో సోనాల్ చౌహన్ – వేదిక హీరోయిన్స్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ – భూమిక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here