సోదరుడిని పరామర్శించడానికి హాస్పిటల్ కి వచ్చిన రజినీకాంత్

0
553

సూపర్ స్టార్ తలైవా సడన్ గా బెంగుళూరులోని ఒక హాస్పిటల్ ముందు ప్రత్యక్షం కావడంతో చుట్టూ ప్రక్కల ఉన్న వారందరు ఒక్కసారిగా షాకయ్యారు. రజినీకాంత్ హాస్పటల్ కి వచ్చారని తెలియగానే ఒక్కసారిగా ఆ ప్రయివేట్ హాస్పిటల్ కి భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ముందు ఆయన ట్రీట్మెంట్ కోసం వచ్చారని టాక్ వచ్చినప్పటికీ అనంతరం ఆయన సోదరుడిని పరామర్శించడానికి వచ్చినట్లు తెలిసింది.

రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ గత కొంత కాలంగా మోకాలి నొప్పులతో బాధపడుతున్నారు. అయితే రీసెంట్ గా సర్జరీ ట్రీట్మెంట్ కోసం బెంగుళూరులోని ప్రయివేట్ ఆసుపత్రిలో చేరారు. తన అన్నయ్యను పరామర్శించడానికి రజిని దర్బార్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి బెంగుళూరుకి వెళ్లాల్సి వచ్చింది. తన సోదరుడి ఆరోగ్యంపై డాక్టర్లతో కొంత సేపు మాట్లాడిన తలైవా అనంతరం అభిమానులకు అభివాదం తెలుపుతూ షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here