పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

0
637

నాచురల్ స్టార్ నాని పిల్ల జమిందార్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొని సినిమాలో నటించినవారందరికీ అవకాశాలు వచ్చేలా చేసింది. ఇక హీరోయిన్ హరి ప్రియ కూడా భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది. అయితే రీసెంట్ గా హరిప్రియ పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన పుకార్లపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది..

తాను ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదని చెబుతూ ప్రస్తుతం వైరల్ అవుతోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. అలాగే ఇప్పుడు తాను సినిమాలతో చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్పిన హరిప్రియ పెళ్లి గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదని అన్నారు. తనకు సరిపడే లైఫ్ పార్టనర్ కూడా ఇంకా దొరకలేదని, బహుశా వెతకడానికి ఇదే సరైన సమయం అయ్యి ఉంటుందేమో అని హరిప్రియ తనదైన శైలిలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here