ప్రభాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమా సాహో మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు కౌంట్ డౌన్ మొదలయ్యింది. అభిమానుల జోష్ ఏ రేంజ్ ఉందొ సోషల్ మీడియాపై ఓ లుక్కిస్తే ఈజీగా అర్ధమవుతుంది. అయితే సినిమా వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ప్రతి ఒక్కరి ద్రుష్టి తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన నైజం ఏరియాపైనే పడింది. ఎందుకంటే నైజాంలో మొదటిరోజు 700కు పైగా మల్టీప్లెక్స్ షోలు ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. ఆ ఏరియాలో ఇదే హయ్యెస్ట్ రిలీజ్ అని చెప్పవచ్చు. ఇక గ్రాస్ కలెక్షన్స్ – షేర్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ ప్రభాస్ ఫస్ట్ డే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడని చెప్పవచ్చు. మరి యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ బిగ్ బడ్జెట్ మూవీ ఎన్ని సంచలనాలు సృష్టించనుందో చూడాలి.


