సాహో ఎఫెక్ట్.. రాత్రుళ్ళు నిద్ర లేదట!

0
494

రెబల్ స్టార్ ప్రభాస్ బిగ్ బడ్జెట్ మూవీ సాహో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అలాగే చిత్ర యూనిట్ లో టెన్షన్ కూడా పెరుగుతోంది. అయితే బాహ్య ప్రపంచంలో ప్రభాస్ తీరిక లేకుండా ప్రమోషన్స్ చేస్తుంటే దర్శకుడు ఇతర టెక్నీషియన్స్ సినిమా కు ఫీనిషింగ్ టచ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు.

ఎంత బిజిగా ఉన్నారు అంటే.. రాత్రుళ్ళు నిద్ర లేకుండా కష్టపడుతున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ ఒక ట్వీట్ తో చెప్పేశాడు. సుజిత్ విజన్ కి సెల్యూట్ అంటూ.. వర్క్ చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నట్లు పేర్కొన్నాడు. జిబ్రాన్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఒకటికి పదిసార్లు రిలీజ్ డేట్ ముందు రోజు వరకు సినిమాను పలు విధాలుగా చెక్ చేయక తప్పదు. ఫైనల్ కాపీ రెడీ అయినప్పటికీ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చినప్పటికీ ఇంకా క్వాలిటీ కోసం చిత్ర యూనిట్ కష్టపడుతున్న విధానానికి అభినందించాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here