అఆ.. ఇంట్లో భీష్మ..

0
542

యువ కథానాయకుడు నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుములు డైరెక్షన్ లో భీష్మ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఒక సీన్ ను నితిన్ గతంలో చేసిన ‘అఆ’ సినిమా సెట్ లొనే తెరకెక్కించారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అఆ సినిమాలో హీరో మిడిల్ క్లాస్ జీవితానికి తగ్గట్టుగా ఇల్లు సెట్ వేయించారు.

ఆ సెట్ ఇంకా చెక్కు చెదరకుండా అలానే ఉంది. దీంతో భీష్మా యూనిట్ మళ్ళీ అక్కడ ఒక సీన్ ని షూట్ చేసింది. ఇక నితిన్ ఫన్నీ గా ఎమోషనల్ అవుతూ అఆ అని సినిమాను గుర్తు చేసుకున్నాడు. అలాగే మిస్ యూ త్రివిక్రమ్ గారు అంటూ  సోషల్ మీడియాలో ఆ లొకేషన్ వీడియో పోస్ట్ చేశారు. 2016లో సమ్మర్ ఎండింగ్ లో వచ్చిన అఆ సినిమా నితిన్ కెరీర్ లొనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here