ఇంటర్నేషనల్ స్టైల్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ – రెబల్ స్టార్ ప్రభాస్

1
2625

బాహుబలి తరువాత ఆల్ ఇండియా స్టార్ గా ఎదిగారు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఆయన హీరోగా సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా రూపొందుతోన్న భారీ యాక్షన్ చిత్రం `సాహో`. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ఈ చిత్రం ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతుంది.. ఈ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటర్వ్యూ..

బాహుబలి’తరువాత వస్తున్న సినిమా కాబట్టి ఆడియన్స్‌లో, ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి! ఏమైనా ప్రజర్‌ ఫీల్‌ అవుతున్నారా?
– ‘బాహుబలి’ సినిమా ఒక చరిత్ర సృష్టించింది. అయితే ‘సాహో’ సినిమాని ‘బాహుబలి’తో పోల్చలేం..కానీ ‘బాహుబలి’ చూసిన ప్రేక్షకులను ‘సాహో’ అలరిస్తే చాలు అని మీమనుకుంటున్నాము.. ఈ సినిమాపై మేము చాలా సమయం, డబ్బు పెట్టుబడిగా పెట్టాం. అందువల్ల మేము కాస్త ఒత్తిడికి గురవుతున్నాము.

సుజిత్‌ ఈ ప్రాజెక్టులోకి ఎలా ఎంటర్‌ అయ్యారు?
– ‘రన్‌ రాజా రన్‌’ టైమ్‌ నుండే సుజీత్‌ నాకు బాగా తెలుసు. యూవిక్రియేషన్స్‌ అతన్ని ఇంట్రడ్యూస్‌ చేసింది. ఆ సినిమా చూసి నాకు నెక్స్ట్‌ మూవీకి వర్క్‌ చేస్తావా? అని అడిగాను. లేదు.. కథ తీసుకువస్తాను అని చెప్పాడు. అప్పుడే అతని కాన్ఫిడెన్స్‌ నాకు నచ్చింది. స్టోరీ నరేషన్‌ టైమ్‌లో కూడా ఏదయినా లవ్‌ స్టోరీ చెప్తాడు అనుకున్నాను, కానీ ఒక మంచి స్క్రీన్‌ ప్లే బేస్డ్‌ మూవీతో వచ్చాడు. నాకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను.

సాహో విడుదల ఆలస్యం అవడానికి కారణం?
– ‘బాహుబలి’ పీరియాడిక్‌ మూవీ దానికి కొన్ని నెలల పాటు శిక్షణ తీసుకున్నాం. కానీ ‘సాహో’ అలా కాదు ఇది టెక్నికల్‌ బేస్డ్‌ మూవీ. దానికోసం ఎక్కువ ప్లానింగ్‌, ప్రిపరేషన్‌ కావాల్సి వచ్చింది. అలాగే కొన్ని యాక్షన్‌ సీక్వెన్సెస్‌కి ఏడాదిన్నర టైమ్‌ పట్టింది. మేకింగ్‌ వీడియోలో మీరు చూస్తే కొన్ని ట్రక్స్‌ని బిల్ట్‌ చేయడం కనిపిస్తుంది. అలాగే ప్రోక్లెనేర్‌ కూడా ఉంటుంది. 30 కార్‌ లను ఈ సినిమా కోసం స్పెషల్‌గా డిజైన్‌ చేయడం జరిగింది. అలాగే ఒక ట్రక్‌ని రియల్‌గా బ్లాస్ట్‌ చేశాం. ఇలా మీరు చూసుకుంటే ఎక్కువ ప్రిపరేషన్‌, ప్లానింగ్‌, జాగ్రత్తలు తీసుకోవాల్సి రావడంతో కొంత ఆలస్యం అయింది.

సుజిత్‌ ఈ కథ చెప్పగానే సినిమా స్కేల్‌, రేంజ్‌ డిసైడ్‌ అయిందా?
– ‘బాహుబలి’ తర్వాత అసలు యాక్షన్‌ మూవీ చేయొద్దు అనుకున్నాను. ఎందుకంటే రాజమౌళి గారి థాట్‌ ప్రాసెస్‌ వేరు. ఆయన ‘బాహుబలి’లో వాటర్‌ ఫాల్స్‌ సీన్‌ చెప్తున్నపుడే నాకు చాలా భయం వేసింది. అయితే ఆ టైమ్‌లో సుజిత్‌ స్క్రీన్‌ ప్లే బేస్డ్‌ మూవీ చెప్పడంతో ‘బాహుబలి’ వర్కౌట్‌ అయితే చూద్దాం అనుకున్నాను. ‘బాహుబలి’ మా అంచనాలను మించి విజయం సాధించడంతో సుజిత్‌ స్టోరీని డెవలప్‌ చేస్తూ వెళ్ళాడు. అయితే 150 కోట్లలో సినిమా చేద్దాం అనుకున్నాం.. కానీ కుదరలేదు..

‘సాహో’ బడ్జెట్‌ పెరుగుతుంటే మీకేమనిపించేది?
– ‘సాహో’ బడ్జెట్‌ పెరుగుతుంటే నిద్ర పట్టేది కాదు. చాలా ఒత్తిడిగా అనిపించేది. బడ్జెట్‌ అనేది అది నా డిపార్ట్‌మెంట్‌ కాదు. అది నా స్నేహితులు చూసుకుంటారు. వాళ్లెప్పుడూ నాణ్యత విషయంలో రాజీ పడరు. ‘రన్‌రాజారన్‌’ సినిమాకే 9 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సినిమా బడ్జెట్‌ తక్కువ చేయడం కోసం ఎంతో శ్రమించాం.

బడ్జెట్‌ పెరగడానికి గల కారణాలు?
– ఆడియన్స్‌కి మళ్ళీ ఓ విజువల్‌ ఇంపాక్ట్‌ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే ‘సాహో’ సినిమాలో కొన్ని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని స్పెషల్‌గా డిజైన్‌ చేశాం. ఎక్కువ భాగం యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అబుదాబి, హైదరాబాద్‌లో చేశాం. అలాగే ఇటలీలో నాలుగు రోజులు షూట్‌ చేశాం. అదికాక ఈ సినిమాకోసం ఇంతవరకు మనం చూడని లేటెస్ట్‌ టెక్నాలజీ గల కెమెరాస్‌ పారిస్‌, యూరప్‌, దుబాయ్‌ నుండి తెప్పించాము. సాంగ్స్‌ పిక్చరైజేషన్‌లో కూడా జాగ్రత్త తీసుకొని విజువల్‌ ట్రీట్‌ ఇవ్వాలని డిసైడ్‌ అయ్యాం దాంతో బడ్జెట్‌ కూడా పెరిగింది.

సాహో కోసం బరువు తగ్గారా?
– ‘బాహుబలి’ కోసం 98 కేజిస్‌ పెరిగాను. అయితే ఈ సినిమాలో కొంచెం లీన్‌ లుక్‌ ఉంటే బాగుటుంది అనడంతో చాలా ట్రై చేశాను. అయితే వర్కవుట్‌ కాలేదు దాంతో వెజిటేరియన్‌ ట్రై చేసి బరువు తగ్గాను.

సాహో కంటెంట్‌ ఎలా ఉండబోతుంది?
– సినిమాలో వాయిలెన్స్‌ ఉంటుంది. హై టెక్నికల్‌ వాల్యూస్‌ తో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉంటాయి. కానీ వాటితో పాటు మంచి లవ్‌ ట్రాక్‌ అలాగే కామెడీ కూడా ఉంటుంది. అన్నిటికిమించి స్క్రీన్‌ ప్లే మెస్మరైజ్‌ చేస్తుంది. అలాగే ఎమోషన్‌ కంటెంట్‌ కూడా సినిమాలో చాలా బాగా వర్కువుట్‌ అవుతుంది.

పాన్‌ ఇండియా తీద్దామని డిసైడ్‌ అయ్యే ఆర్టిస్టులని సెలెక్ట్‌ చేశారా?
– అవునండీ! ఎందుకంటే ఈ కథ రాసింది ఒక తెలుగు వాడు, అలాగే దర్శకుడు తెలుగు వాడు, నటించేది ఒక తెలుగువాడే.. దాంతో ఒక పాన్‌ ఇండియా సినిమా చేద్దాం అని అన్ని స్టేట్స్‌ నుండి ఆర్టిస్టులని తీసుకోవడం జరిగింది. అప్పుడే వారికి సినిమా బాగా రీచ్‌ అవుతుంది.

ఈ సినిమాలో మీరు డ్యూయల్‌ రోల్‌ చేశారా?
– సినిమాలో నేను డ్యుయల్‌ రోల్‌ చేశానా? లేదా అన్నది చెప్పేయొచ్చు. అదేం పెద్ద కష్టమేం కాదు కాని మీకు ఆ ఎగ్జైట్‌ మెంట్‌ పోతుంది. అందుకే చెప్పట్లేదు. నిజానికి ఆ సస్పెన్స్‌ క్రియేట్‌ చేయాలన్న ఉద్దేశ్యంతోనే ట్రైలర్‌ కూడా అలా కట్‌ చేశాం.

ఈ సినిమాకోసం హాలీవుడ్ టెక్నీిషియన్స్‌ వర్క్ చేశారు కదా?
– సినిమాలో కొన్ని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కోసం కొందరు హాలీవుడ్‌ టెక్నీిషియన్స్‌ కూడా పనిచేసారు. ముఖ్యంగా విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఎడిటింగ్‌ డిపార్ట్మెంట్స్‌కి సంబంధించి హాలీవుడ్‌ టీంలు వర్క్‌ చేసాయి. కొన్ని ఎపిసోడ్స్‌కి శ్రీకర్‌ ప్రసాద్‌ గారితో మాట్లాడి హాలీవుడ్‌ ఎడిటర్స్‌తో వర్క్‌ చేయించాం. ఆ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ థియేటర్స్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది.

మొదటి సినిమా ఈశ్వర్‌ టైమ్‌ లో కూడా మీరు టెన్షన్‌ పడ్డారు కదా?
– నిజానికి నా మొదటి సినిమా ‘ఈశ్వర్‌’ రిలీజ్‌కి ముందు కూడా టెన్షన్‌ పడ్డాను. అసలు ప్రేక్షకులకి నచ్చుతానా ? లేదా సినిమా చూస్తారా లేదా అని , ఇప్పుడు ‘బాహుబలి’ తరువాత వారి ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్‌ అవుతానా? లేదా అని టెన్షన్‌ పడుతున్నా. అదో టెన్షన్‌ ఇదో టెన్షన్‌. కానీ టెన్షన్‌ మాత్రం కామన్‌ అయిపోయింది.

బాలీవుడ్‌లో మీతో ఎవరెవరు క్లోజ్‌గా ఉంటారు?
– బాలీవుడ్‌లో రణబీర్‌ కపూర్‌ నా ప్రతీ సినిమాకు ఫోన్‌ చేసి మాట్లాడతాడు. అలాగే అజయ్‌ దేవగన్‌ కూడా క్లోజ్‌గా ఉంటారు. అమీర్‌ ఖాన్‌ గారు మూడు నెలల క్రితం ఫోన్‌ చేసిన ఓ సినిమా ప్రీమియర్‌కి పిలిచారు. బయట ఉన్న డిస్కర్షన్‌ అక్కడ ఉండదు. నాతో అందరూ బాగా మాట్లాడతారు.

తెలుగు సినిమాల గురించి మీరేం చెప్తారు?
– ప్రస్తుతం తెలుగులో కొత్త ఒరవడి మొదలైంది. డిఫరెంట్‌ కంటెంట్‌తో వచ్చిన చిన్న సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి. యాక్టర్స్‌లో కూడా చేంజ్‌ వస్తుందని ‘అర్జున్‌ రెడి’్డ తో ప్రూవ్‌ అయింది. నాని కూడా ‘జెర్సీ’ అనే డిఫరెంట్‌ కంటెంట్‌తో సినిమా చేసాడు. ఈ ఏడాది మన సినిమాలు ఎక్కువ జాతీయ అవార్డులు కూడా గెల్చుకున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. చిన్న సినిమాలు ప్రేక్షకాదరణ పొందడం అనేది మంచి పరిణామం. అప్పుడే కొత్త కాన్సెప్ట్‌ సినిమాలు వస్తాయి.

సాహో ప్రజర్‌ మొత్తం మీరే తీసుకుంటున్నారు. మరి మీ ప్రజర్‌ తీసుకునే లైఫ్‌ పార్టనర్‌ ఎప్పుడు వస్తారు?
– ఏమో ప్రజర్‌ తీసుకునే వారు వస్తారో? ప్రజర్‌ పెట్టే వారు వస్తారో వేచి చూడాలి ( నవ్వుతూ)..

సుజిత్‌ ఈ ప్రాజెక్టుని హేండిల్‌ చేయగలడని మీకెప్పుడు అనిపించింది?
– సినిమాలో ఒక కీ సీక్వెన్స్‌ ఉంటుంది. షూట్‌ మొదలైన రెండో రోజు షూట్‌ చేశాం. ఆ సీన్‌ సినిమాలో చాలా చోట్ల వస్తుంది. క్యారెక్టర్స్‌కి చాలా లేయర్స్‌ ఉంటాయి. అప్పుడే సుజీత్‌ మీద బాగా నమ్మకం వచ్చింది. ఆ టైంలో భలే చేసావ్‌ సుజీత్‌ అనిపించింది. అలా చాలా సందర్భాల్లో సుజీత్‌ మీద కాన్ఫిడెన్స్‌ వచ్చింది.

ఫ్యూచర్‌లో రణబీర్‌కపూర్‌ మీరు కలిసి ముల్టీస్టారర్‌ మూవీ చేసే అవకాశం ఉందా?
– ఇప్పుడే ఏం చెప్పలేం కానీ అన్ని కుదిరితే తప్పకుండా ముల్టీస్టారర్‌ చేస్తాను.

సాహో తరువాత మీ పెదనాన్న గారి ఫీలింగ్‌ ఏంటి?
– మా ఫ్యామిలిలో ఎవరైనా ఆయన తరువాతే.. పెదనాన్న గారు డిల్లీ వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఎవరైనా నా గురించి మాట్లాడిన ‘బాహుబలి’ గురించి మాట్లాడినా ఆయన పొంగిపోతుంటారు. ఆ క్షణంలో కొంచెం లావైపోతారు(నవ్వుతూ).

మీరు గోపికృష్ణ బ్యానర్‌లో చేయబోయే సినిమాకు మీ పెదనాన్న ఇన్పుట్స్‌ ఏమైనా ఇచ్చారా?
– లేదండి! ఆయన స్టోరీ విన్నారు, ఆయనకు రాధా కృష్ణ గారు చెప్పిన స్టోరీ బాగా నచ్చింది. ‘బిల్లా’ సినిమా నేను ఆయన యాక్సెప్ట్‌ చేస్తారనుకోలేదు. ఇన్పుట్స్‌ ఏమైనా చెప్తారేమో అనుకున్నాను అంతే. ప్రెజెంట్‌ అండ్‌ పాస్ట్‌ లవ్‌ స్టోరీని ఆయన యాక్సెప్ట్‌ చేయడం జోక్‌ కాదు. ఆయనది మోడ్రన్‌ ఐడియాలజీ.

ఈ సినిమా ద్వారా మీ ఫాన్స్‌కి ఏం చెప్తారు?
– ‘సాహో’ తప్పకుండా ఫ్యాన్స్‌ని శాటిస్‌ఫై చేేసే సినిమా అవుతుంది.

కొరటాల శివ గారితో మూవీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి?
– శివ గారు మిర్చితో డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఇద్దరం కలిసి మళ్ళీ కచ్చితంగా సినిమా చేస్తాం. ప్రస్తుతం ఆయనొక పెద్ద సినిమా చేస్తున్నారు. అది పూర్తయ్యాక నేను కూడా ఫ్రీ అయ్యాక కలిసి డిస్కస్‌ చేస్తాం.

బాహుబలి తర్వాత కూడా మీ లైఫ్‌ స్టైల్‌ ఏ మాత్రం మారలేదు.. ఎవరినైనా ఇన్స్‌పిరేషన్‌ గా తీసుకున్నారా?
– చిరంజీవి, రజనీకాంత్‌, రాజమౌళి, వివి వినాయక్‌ లాంటి వారు తమ సినీ కెరీర్‌లో ఎన్నో గొప్ప విజయాలు చూశారు. అయినా వారు అలానే ఒదిగి ఉన్నారు. కాబట్టి ‘బాహుబలి’ విజయం నా లైఫ్‌ స్టైల్‌పై ఏ మాత్రం ప్రభావం చూపదు. ఒదిగి ఉండటంవీరి దగ్గరే నేను నేర్చుకున్నా. అంటూ ఇంటర్వ్యూ ముగించారు రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌.

Prabhas – Pics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here