టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ప్రస్తుతం రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరిగా నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. స్వరవాణి కీరవాణి సంగీత సారథ్యంలో తెరకెకెక్కుతున్న ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ ని అందిస్తున్నారు.
ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ ని బల్గెరియా దేశంలో నేటి నుండి ప్రారంభించనుంది సినిమా యూనిట్. కొన్ని కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో చిత్రీకరించన్నారట. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించే నటిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా, 2020, జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది….!!