ప్రేమ కోసం ప్రపంచమంతా తిరగాల్సిన అవసరం లేదు. అది మనలోనే ఉందని టాలెంటెడ్ బ్యూటీ నిత్యామీనన్ తనదైన శైలిలో ప్రేమ పాఠాలు చెబుతోంది. ముందుగా మనల్ని మనం గౌరవించుకోవాలి అంటూ అనవసరంగా ఇతరులు మనల్ని గౌరవించుకోవాలని అనుకుంటున్నామని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించింది.
సాధారణంగా ప్రేమ కోసం మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా వెతుకుతాం. ప్రేమ కోసం మరొకరు అవసరం లేదు. అది మనలోనే ఉంటుంది. మనలో మనమే ప్రేమను నింపుకుంటే అప్పుడు ప్రపంచమంతా ప్రేమమయం అవుతుంది అని నిత్యా వివరణ ఇచ్చింది. ఇటీవల బాలీవుడ్ లో నిత్యా మిషిన్ మంగళ్ సినిమాతో నార్త్ ఆడియెన్స్ ని మెప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇష్క్ హీరోయిన్ జయలలిత బయోపిక్ కోసం సిద్ధమవుతోంది. అలాగే మలయాళంలో రెండు సినిమాలు చేస్తోంది.


