విజయ్ 64 ప్రాజెక్ట్ ఇదే

0
326
Thalapathy Vijay 64 Movie

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఇళయతలపతి విజయ్ 64వ సినిమా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. గత కొన్ని వారాలుగా ఈ ప్రాజెక్ట్ పై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టి అధికారిక ప్రకటనను విడుదల చేశారు. యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ చెప్పిన స్క్రిప్ట్ విజయ్ కి నచ్చడంతో సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులకు ముహూర్తం సెట్టయ్యింది.

ప్రస్తుతం విజయ్ అట్లీ డైరెక్షన్ లో బిగిల్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కానుంది. ఇక విజయ్ తన 64వ సినిమాను బిగిల్ రిలీజ్ అనంతరం అక్టోబర్ లొనే స్టార్ట్ చేయనున్నాడు. క్సావియర్ బ్రీటో నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించనున్నాడు. 2020 సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here