సాహో.. హాట్ కేకుల్లా అడ్వాన్స్ బుకింగ్స్

0
417
Prabhas Saaho Advance Bookings

రెబెల్ స్టార్ ప్రభాస్ సాహో మొదటి రోజు ఆన్లైన్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. సెన్సార్ పూర్తవడంతో ముల్టీప్లెక్సులతో సహా అన్ని థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయాయి. ఫస్ట్ డే దాదాపు మల్టిప్లెక్స్ లు హౌజ్ ఫుల్ అయ్యాయి. సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

మహేష్ బాబు AMB సినిమాస్ లో ప్రదర్శించనున్న 16షోల టికెట్లు చూస్తుండగానే మొత్తం అమ్ముడైపోయాయి. ఆగస్ట్ 30 శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమాకు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన నగరాల్లో ఫస్ట్ డే మల్టిప్లెక్స్ లలోని అన్ని షోలు హౌజ్ ఫుల్ బోర్డులతో దర్శనమివ్వనున్నట్లు అర్ధమవుతోంది. ఇక సింగిల్ స్క్రీన్స్ కూడా ఫుల్ కావడానికి ఎంతో సమయం పట్టేలా లేదు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here