టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీస్ లో ఒకటైన సైరా నరసింహారెడ్డి మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో అనుష్క నటించినట్లు గత కొంత కాలంగా వస్తున్న కథనాలకు సైరా టీమ్ క్లారిటీ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ ఇటీవల బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క ఝాన్సీ లక్ష్మి భాయి పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు.
సినిమాలో ఆమె పాత్ర ద్వారానే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర పరిచయం అవుతుందని చెప్పిన మెగాస్టార్ ఆ పాత్రకు సంబందించిన డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయని అన్నారు. అదే విధంగా నిర్మాత చరణ్ అనుష్క వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయి పాత్రలో కనిపించనున్నట్లు ఫైనల్ క్లారిటీ ఇచ్చారు.