రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో పై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. తెలుగు సహా పలు ఇతర భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే నేడు ఈ మూవీకి ఒక అరుదైన ఘనత లభించింది. ట్విట్టర్ ఎమోజిని దక్కించుకున్న సాహో తోలి తెలుగు సినిమాగా అద్భుత రికార్డు నెలకొల్పింది.
ఇప్పటివరకు బాలీవుడ్ అలానే కోలీవుడ్ లో రిలీజ్ అయిన పలు సినిమాలకు మాత్రమే లభించిన ట్విట్టర్ ఎమోజి, తొలిసారి మన తెలుగు సినిమా అయిన సాహోకు లభించడం ఎంతో ఆనందదాయకమని, పలువురు సాహో పై పొగడ్తలు కురిపిస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ జోడి కడుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈనెల 30వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది….!!