అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ పూజా హెగ్డే. గ్యాప్ లేకుండా అవకాశాలను అందుకుంటూ తన స్టార్ డమ్ ని పెంచుకుంటోంది. అయితే ఈ కన్నడ బ్యూటీ తన దగ్గరికి వచ్చిన దర్శకులకు ఒక కండిషన్ పెడుతోందట. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా వివరణ ఇచ్చింది.
‘నా దగ్గరికి దర్శకులు కథ చెప్పడానికి వచ్చినప్పుడు డైలాగ్స్ స్క్రిప్ట్ షూటింగ్ కి ఒక రోజు ముందు తప్పకుండా ఇవ్వాలని కోరతాను. అందుకు కారణం ఉంది. ముందే డైలాగ్స్ నేర్చుకుంటే వర్క్ తొందరగా ఫినిష్ చేయవచ్చు. స్టార్ హీరోస్ తో ఈజీగా నటించవచ్చు. అలాగే తెలుగు వీలైనంత తొందరగా నేర్చుకునే అవకాశం ఉంటుంది’ అని పూజా తన వివరణ ఇచ్చారు.