ఇండియన్ రిచస్ట్ యాక్టర్ గా అక్షయ్

0
550

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఫోర్బ్స్ జాబితాలో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. ఈ సారి ఎవరు ఊహించని విధంగా ఈ మిస్టర్ ఖిలాడీ అత్యధిక సంపాదన కలిగిన నటుల్లో గుర్తింపు దక్కించుకోవడం ఆశ్చర్యమనే చెప్పాలి. గత ఏడాది జుని 1 నుంచి ఈ ఏడాది మే 31వరకు సినీ తారల మొత్తం సంపాదనను లెక్కల్లోకి తీసుకున్న ఫోర్బ్స్ అక్షయ్ నాలుగో స్థానంలో ఉన్నట్లు ప్రకటించింది.

ఈ ఏడాది అక్షయ్ కుమార్ వరుసగా సినిమాలను రిలీజ్ చేయడమే కాకుండా ఇతర ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగాడు. దీంతో అతని సంపాదన 65 మిలియన్‌ డాలర్లకు చేరుకుందని పేర్కొన్నారు. అంటే ఇండియన్ కరెన్సీ లో దాదాపు 460 కోట్ల రూపాయలన్నమాట. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే హాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ డ్వేన్‌ జాన్సన్‌ 89.4 మిలియన్‌ డాలర్ల సంపాదనతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here