ఫోటో కామెంట్ – గ్లామరస్ జాన్వీ కపూర్

0
614

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ మరోసారి ఇంటర్నెట్ మీడియాని షేక్ చేస్తోంది. ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఫిట్నెస్ వర్కౌట్స్ తో బిజీగా ఉండే జాన్వీ ఇటీవల కార్గీల్ గర్ల్ షూటింగ్ అయిపోగానే జిమ్ దగ్గర దర్శనమిచ్చింది. చాలా రోజుల తరువాత జాన్వీ కనిపించడంతో జనాలు చూపు తిప్పుకోలేకపోతున్నారు.

పింక్ అండ్ బ్లాక్ డ్రెస్సింగ్ మ్యాచింగ్ లో ఈ అతిలోక సుందరి చాలా అందంగా ఉందంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఈ బ్యూటీ ధఢక్ సినిమా తరువాత వరుసగా అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న కార్గిల్ గర్ల్ సినిమాతో పాటు సంజయ్ లీలా భన్సాలీ కొత్త చిత్రంలో కూడా నటించడానికి ఒప్పుకుంది. ఇక దోస్తానా సినిమాలో కూడా జాన్వీ ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here