25 కోట్ల క్లబ్ లో జయం రవి – కాజల్ కోమలి

0
4371

జయం రవి – కాజల్ అగర్వాల్ నటించిన తమిళ్ సినిమా కోమలి. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ డిఫరెంట్ ఫిల్మ్ కోలీవుడ్ లో మంచి కలెక్షన్స్ ని అందుకుంటోంది. ఈ నెల ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోమలి 6 రోజుల్లోనే 25కోట్లను వసూలు చేసింది.

కామెడీతో పాటు సినిమాలో మానవీయ కోణం కూడా జోడించడం తో సినిమా పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ ని పెంచుకుంటూ పోతోంది. జయం రవి కెరీర్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ లో కోమలి కూడా చేరింది. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కె గణేష్ నిర్మించారు. కాజల్ తో పాటు సంయుక్తా హెగ్డే కూడా సినిమాలో మంచి నటనను కనబరిచింది. కోమలి 25కోట్ల క్లబ్ లో చేరడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కు రెడీ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here