టైటిల్ ఫిక్స్ చేసుకున్న 25వ బాండ్

0
494

హాలీవుడ్ లో యాక్షన్ మూవీస్ కు ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా జేమ్స్ బాండ్ సినిమాలంటే యాక్షన్ లవర్స్ కి అమితమైన ఇష్టం. వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన జేమ్స్ బాండ్ సిరీస్ లో ఇప్పటికే 24 సినిమాలు వచ్చి జనాలను ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు 25వ జేమ్స్ బాండ్ కూడా రెడీ అవుతున్నాడు.

సినిమా టైటిల్ ని చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. ‘నో టైం టు డై’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. డేనియల్‌ క్రెగ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మొదట ఏ రీజన్‌ టు డై అనే టైటిల్ ని అనుకున్నప్పటికీ ఫైనల్ గా నో టైం టు డైగా పేరు మార్చారు. కారీ జోజి ఫుకునాగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మోట్రో గోల్డెన్‌ మేయర్‌, ఇయోన్ ప్రొడక్షన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. 2020 ఏప్రిల్ 3న యూకే, ఇండియాలో విడుదలైన తరువాత 2020 ఏప్రిల్ 8న అమెరికాలో ఈ జేమ్స్ బాండ్ మూవీ రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here