రేటింగ్స్ తో బిగ్ బాస్ హ్యాట్రిక్ రికార్డ్

0
422

బుల్లితెర అభిమానులను బిగ్ బాస్ 3వ సీజన్ కూడా తెగ ఆకట్టుకుంటోంది. గత సీజన్స్ మాదిరిగానే కూల్ గా మొదలైన షో ఊహించని మలుపులతో ముందుకు సాగుతోంది. అయితే ఈ అల్ట్రా-పాపులర్ రియాలిటీ షో మరోసారి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ పాపులర్ షోకి కింగ్ అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే స్టార్ మా 1000+ GRP (గ్రాస్ రేటింగ్ పాయింట్స్) లతో వరుసగా మూడవసారి తన సత్తా చాటి హ్యాట్రిక్ రికార్డ్ అందుకుంది. తద్వారా 11.7 TVR (టెలివిజన్ రేటింగ్) తో బిగ్ బాస్ నంబర్ 1 స్థానాన్ని అందుకుంది. (వీకెండ్ లో 1058 GRP లతో ఉంది). ఈ రేటింగ్స్ వారాలు గడుస్తున్న కొద్దీ ఊహించని స్థాయిలో దర్శనమిస్తున్నాయి. ఇక ముందు ముందు షోలో చాలా ట్విస్ట్ లు ఉండడంతో బిగ్ బాస్ 3, గత సీజన్స్ కంటే ఈ సారి స్పెషల రేటింగ్స్ అందుకుంటుందని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here