గత కొన్నేళ్లుగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న బ్యూటీ అనుష్క శర్మ. గ్లామర్ ప్రజెంటేషన్ తో అందంగా కనిపించే అనుష్క నిరంతరం అభిమానుల నుంచి పాజిటివ్ కామెంట్స్ అందుకుంటుంది. రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక బికినీ పిక్ నెటిజన్స్ ని ఎంతగానో ఆకర్షిస్తోంది. బీచ్ లో ఉన్న అనుష్క చాలా అందంగా ఉందంటూ వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే ఆ లిస్ట్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చేరాడు.
తన పాట్నర్ ఫొటోస్ పై విరాట్ స్పందించిన సందర్భాలు చాలా తక్కువ. రీసెంట్ గా సతీమణి పిక్ పై లవ్ ఎమోజిస్ తో లవ్లీ గా ఉందంటూ చెప్పకనే చెప్పాడు. దీంతో అప్పటివరకు ఒక లెవెల్లో ఉన్న ఆ పిక్ విరాట్ కామెంట్ తో క్షణాల్లో ట్రేండింగ్ లిస్ట్ లోకి చేరిపోయింది. అనుష్క అందంగా ఉందంటూ మరికొంత మంది బాలీవుడ్ సెలబ్రేటిస్ కూడా ఆ పిక్ పై వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.


