`మహానటి` చిత్రంలో సావిత్రిగా అద్భుత నటనతో మైమరిపించిన కీర్తి సురేష్ `జాతీయ ఉత్తమ నటి`గా పురస్కారం దక్కించుకున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగఅశ్విన్ దర్శకత్వంలో అత్యద్భుతంగా రూపొందిన మహానటి చిత్రం, గత ఏడాది మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి, ప్రేక్షకుల నీరాజనాలతో సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసందే. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో మహానటి పాత్రలో అద్భుతంగా నటించిన కీర్తి సురేష్ కు ప్రేక్షకులు సహా పలువురు సినిమా ప్రముఖుల నుండి మంచి ప్రశంశలు లభించాయి.
కతర్ రాజధాని దోహ లో జరిగిన `సైమా అవార్డుల` వేడుకలో ముఖ్య అతిధి మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకున్నారు. ఈ అవార్డుల కార్యక్రమంలో సావిత్రిని తలపించేలా సాంప్రదాయ చీరకట్టులో కీర్తి దర్శనమిచ్చారు. కీర్తి మెగాస్టార్ వద్దకు చేరుకుని ఎంతో వినమ్రంగా నవ్వులు చిందిస్తూ ముచ్చట్లాడారు. మెగాస్టార్ సైతం చిరునవ్వులు చిందిస్తూ తనకు ఆశీస్సులు అందిస్తున్న ఆ దృశ్యం కన్నులపండువగా కనిపిస్తోంది.


