టాలెంటెడ్ హీరో అడివి శేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర కీలక పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఎవరు’. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా బ్యానర్ పై వెంకట్ రాంజీ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 15 న ప్రపంచవ్యాప్తంగా రిలీజై క్యాప్టివేటింగ్ హిట్ గా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం పొందుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…
హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – “ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి సినిమా మీద ఉన్న ఫ్యాషన్ తో క్షణం అనే చిన్న కాన్సెప్ట్ ని ఒక టీమ్ వర్క్ గా చేసుకొని సినిమాను పెద్ద సక్సెస్ చేసి తనకంటూ ఒక ఐడెంటిటీ ని ఏర్పాటుచేసుకున్నారు అడివి శేష్. సర్ మాకు బ్యాక్ గ్రౌండ్ లేదు మా సినిమాలు ఎవరు చూస్తారు అనేది ….ఇండస్ట్రీ లో నేను తరచుగా వినేమాట. అయితే దానికి ఉదాహరణ శేష్. మన దగ్గర టాలెంట్ ఉంటే కష్టపడి ఏదయినా చేయొచ్చు అని ఒక యాక్టర్ గా ఈ స్థాయికి ఎదిగి నిరూపించాడు. నేను రిలీజ్ కి ముందు రోజే సినిమా చూశాను. పాటలు, ఫైట్స్ లేకుండా వెంకట్ రాంజీ, శేష్ సినిమాను ఇంట్రెస్టింగ్ గా నడిపారు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలో ఇన్ని ట్విస్ట్ లు, టర్న్ లు ఇస్తూ కూడా ఆడియన్స్ ని ఇంట్రెస్టింగ్ గా కూర్చోబెట్టారు. మీడియా, ప్రేక్షకులు సినిమాకు మంచి రిపోర్ట్ ఇచ్చారు. వరల్డ్ వైడ్ గా కూడా మంచి రెస్పాన్స్ ఉంది. రెజీనా మా బ్యానర్ లో రెండు సినిమాలు చేసింది. ఆమె రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో బాగా పెర్ఫామ్ చేసింది. నిర్మాత పి.వి.పి గారు నా మిత్రుడు. మా ఫ్రెండ్ బ్యానర్ లో మళ్ళీ ఒక మంచి సినిమా వచ్చినందుకు హ్యాపీ గా ఉంది. ఈ సినిమాను నైజాంలో నేనే రిలీజ్ చేశాను. శేష్ ని మా బ్యానర్ లో కూడా ఇలాంటి సినిమా చేయమని అడిగాను. తన నెక్స్ట్ మూవీస్ తరువాత ఉండొచ్చు..క్షణం, గూఢచారి , ఎవరు తో యాక్టర్ గా అచీవ్ చేశాడు. అలాగే కొత్త దర్శకులు ఇలాంటి కాన్సెప్ట్ లతో సినిమా చేయడానికి వస్తే మేము కూడా రెడీ గా ఉన్నాం. టీమ్ అందరికీ బెస్ట్ విషెస్” అన్నారు.
దర్శకుడు వెంకట్ రాంజీ మాట్లాడుతూ – ” మూవీ రిలీజ్ అయినప్పటినుండి చాలా అప్రిసియేషన్ వస్తుంది. ఇది నా ఒక్కడి ఎఫర్ట్ కాదు టీమ్ అందరిదీ.. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. సినిమా తీయడం ఈజీ..ఆ సినిమాను ఆడియన్స్ కి రీచ్ చేసి నైజం లో మంచి రిలీజ్ ఇచ్చిన దిల్ రాజు గారికి థాంక్స్. సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాను” అన్నారు.
నటుడు నవీన్ చంద్ర మాట్లాడుతూ – ” ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్. ఈ సినిమాలో ప్రతి ఒక్క క్రాఫ్ట్ ని ప్రశంసిస్తున్నారు. హీరో గానే కాదు ఆర్టిస్ట్ గా కూడా చేయమని దిల్ రాజు గారు ఇచ్చిన సలహా మేరకు మంచి మంచి సినిమాలలో మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. నేను అరవింద సమేత లో చేసిన బాల్ రెడ్డి క్యారెక్టర్ తరువాత అశోక్ అనే క్యారెక్టర్ కి మంచి అప్లాజ్ వస్తుంది. నా క్యారెక్టర్ ఇంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన శేష్, రెజీనా కి థాంక్స్. ఇంత బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత పి.వి.పి గారికి, అలాగే దర్శకుడు వెంకట్ రాంజీ కి కృతజ్ఞతలు” అన్నారు.
హీరోయిన్ రెజీనా కసాండ్ర మాట్లాడుతూ – ” మూవీ రిలీజ్ నుండి ఆడియన్స్, సోషల్ మీడియా నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు మొదటి నుండి సపోర్ట్ చేస్తున్న దిల్ రాజు గారికి థాంక్స్. మంచి టీమ్ ఎఫర్ట్. సమీరా క్యారెక్టర్ ద్వారా నాలోని కొత్త నటిని బయటకు తీశారు దర్శకుడు రాంజీ.. నిన్న థియేటర్స్ లో సినిమా చూశాం. అందరూ సీట్ ఎడ్జ్ లో కూర్చొని సినిమా చూడడం నేను చూశాను. చాలా మంది క్లైమాక్స్ ట్వీస్ట్ ని సోషల్ మీడియా లో పెడుతున్నారు ప్లీజ్ అలా చేయొద్దు.. ఇది మా అందరి రెండేళ్ల కష్టం. సినిమాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీథాంక్స్’ అన్నారు.
హీరో శేష్ మాట్లాడుతూ – ” మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన దిల్ రాజు గారికి థాంక్స్. అలాగే భాను గారు, శిరీష్ గారు మా సినిమాను కరెక్ట్ టైం లో రిలీజ్ చేయడానికి హెల్ప్ చేశారు. చాలా కాలం తరువాత నిన్న ప్రశాంతంగా పడుకున్నాను. రాజు గారు ప్రొడ్యూస్ చేసిన ఎవడు సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం చాలా ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు. ఇప్పుడు ఎవరు సినిమా చూశాక దిల్ రాజు గారు ఫోన్ చేసి నా బ్యానర్ లో సినిమా ఎప్పుడు చేస్తున్నావ్ అని అన్నారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. కలెక్షన్స్ గురించి నాకు ఎక్కువ తెలీదు కానీ గూఢచారి మూడు రేట్లు ఎక్కువ ఓపెన్ అయింది అని తెలిసింది. నిన్న థియేటర్స్ కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా మమ్మల్ని కూడా పట్టించుకోకుండా బిజీ గా సినిమా చూస్తున్నారు. హ్యాపీ గా అనిపించింది. ఈ సినిమాలో మేము రాసిన ప్రతి జోక్ కి నవ్వారు.. ఇచ్చే ప్రతి ట్విస్ట్ కి క్లాప్ కొట్టారు” అన్నారు.
నటుడు మురళి శర్మ మాట్లాడుతూ – ” అన్ని అంశాలలో విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. సపోర్ట్ చేసిన శేష్, రాంజీ, రెజీనా, నవీన్ లకు థాంక్స్. సక్సెస్ ఎప్పుడూ బాగుంటుంది” అన్నారు.


