సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ఎంతో హ్యాపీగా జరిగింది : రష్మిక మందన్న 

0
525

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై వరుస సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నిర్మితం అవుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ నటి విజయశాంతి, సంగీత, బండ్ల గణేష్, మురళి శర్మ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ తనకు మొదటిదని, ఇక ఈ షెడ్యూల్ లో హ్యాపీగా పలువురు నటులతో కలిసి తాను ఎంజాయ్ చేస్తూ నటించానని, రష్మిక కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ తెల్పడం జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని, రత్నవేలు సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here