‘రణరంగం’ సినిమాలో నా క్యారెక్టర్ కీలకం- హీరోయిన్ కాజల్ అగర్వాల్

0
1484

యంగ్ హీరో శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శి ని హీరో హీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగష్టు 15 న గ్రాండ్ గా విడుదలవనుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ విలేకరులతో మాట్లాడారు….

మూడో సారి డాక్టర్ గా…
– ‘రణరంగం’ లో నేను డాక్టర్ గా కనిపిస్తాను. డాక్టర్ క్యారెక్టర్ చేయడం ఇది మూడో సారి. సినిమా సెకండ్ హాఫ్ లో నా క్యారెక్టర్ వస్తుంది. క్యారెక్టర్ చిన్నదే అయినప్పటికీ కథలో కీలకంగా ఉంటుంది. నా క్యారెక్టర్ తోనే కథ ముందుకు సాగుతుంది. అదేంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఇది కంప్లీట్ గా శర్వా సినిమా…
‘రణరంగం’ నా సినిమా కాదు. ఇది కంప్లీట్ గా శర్వా సినిమా. రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో తను మెస్మరైజ్ చేస్తాడు. నా క్యారెక్టర్ మీద ఎలాంటి అంచనాలు పెంచుకోకుండా వస్తే ఆడియన్స్ హ్యాపీ గా ఫీలవుతారు. ఒక మంచి సినిమాలో నేను కూడా పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది.

ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు…
చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమా ద్వారా ఓ ఫాస్ట్ నంబర్ కి డాన్స్ చేసాను. పిక్చర్ పర్ఫెక్ట్ సాంగ్ తో ఈ మధ్య డాన్స్ చేయట్లేదనే బాధ తగ్గిపోయింది. సినిమాలో కచ్చితంగా ఆ సాంగ్ కి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.

సక్సెస్ నా చేతిలో లేదు…
‘సీత’ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. ఆ క్యారెక్టర్ కోసం ఎంతో కృషి చేసాను. సినిమా హిట్టవ్వడం…ఫ్లాపవ్వడం అనేది నా చేతిలో ఉండదు కదా. సినిమా చేసేసాక మిగతావి పట్టించుకోను. ‘సీత’ గా నా పర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. అది హ్యాపీ. బట్ సినిమా హిట్టయితే ఇంకా హ్యాపీ గా ఫీలయ్యే దాన్ని.

ఆ వార్తలో నిజం లేదు..
‘ఇండియన్ 2’ సినిమా నుండి నేను తప్పుకున్నానని వస్తున్న వార్తలో నిజం లేదు. ఆ సినిమా నుండి బయటికొచ్చే సమస్యే లేదు. అది శంకర్ గారి సినిమా అలా ఎలా వదులుకుంటాను. నవంబర్ నుండి షూట్ మొదలవుతుంది. ఆ సినిమా నాకో పెద్ద అవకాశం.

నా క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవుతుంది..
‘ఇండియన్ 2’ లో నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లుక్ , పెర్ఫార్మెన్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. నన్ను నమ్మండి ఆ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవుతుంది. ఇంతకంటే ఆ సినిమా గురించి ఇప్పుడేం ఏం చెప్పలేను.

హీరోయిన్ గా 50 సినిమాలు… 
హీరోయిన్ గా 50 సినిమాలు పూర్తయ్యాయి. కానీ ఇప్పటికీ ఒక బిగినర్ గా ఫీలవుతుంటాను. ప్రతీ సినిమా మొదటి సినిమాగానే భావిస్తాను. అదే నా కెరీర్ సక్సెస్ కి రీజన్ అనుకుంటున్నా. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలన్నది నా ఉద్దేశ్యం. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను. ప్రతీ సినిమా నుండి ఏదో విషయం నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాను.

త్వరలోనే ఆ సినిమా థియేటర్స్ లోకి వస్తుంది…
‘పారీస్ పారీస్’ సినిమా రిలీజ్ కి సెన్సార్ ప్రాబ్లం ఉంది. మూడు భాషల్లో లేని అభ్యంతరం తమిళ్ వర్షన్ కి వచ్చింది. ప్రస్తుతం ప్రొడక్షన్ హౌజ్ ఆ విషయంపై మాట్లాడుతున్నారు. త్వరలోనే ఆ సినిమా థియేటర్స్ లోకి వస్తుంది.

నా ప్రాజెక్ట్స్ తో బిజీ..
ప్రశాంత్ వర్మతో ఓ సినిమాకు సంబంధించి డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను నా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాను. ప్రశాంత్ కూడా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. త్వరలోనే మా కాంబినేషన్ లో సినిమా ఉంటుంది.

నిర్మాతగా మారతాను…
నిర్మాతగా చేయబోయే సినిమాకు ఇంకా టైం పడుతుంది. ప్రస్తుతం నా ఫోకస్ అంతా నటిస్తున్న సినిమాల మీదే. అవన్నీ అయ్యాక మంచి కాన్సెప్ట్ తో నిర్మాతగా మారతాను.

అస్సలు వదులుకోను..
మెగా స్టార్ నటిస్తోన్న సైరా సినిమా కోసం నన్ను ఇంకా ఎవరూ సంప్రదించలేదు. ఒక వేళ అడిగితే మాత్రం వెంటనే చేస్తానని చెప్పేస్తా. ఆయనతో నటించే అవకాశం మళ్ళీ వస్తే అస్సలు వదులుకోను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here