సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సాధించిన సూపర్ ఫ్యాన్స్…!!

0
552
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 44వ జన్మదినాన్ని నిన్న జరుపుకున్న సందర్భంగా ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా ఆయన ఫ్యాన్స్, పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. ఇక రెండు తెలుగు రాష్టాల్లోని పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్, కేక్ కటింగ్ తో పాటు పలు సామజిక కార్యక్రమాలు నిర్వహించి ఆయన బర్త్ డే ని ఎంతో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసారు.
ఇక సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో #HappybirthdaySSMB హ్యాష్ ట్యాగ్ తో వారు ఆయనకు బర్త్ డే విషెస్ ట్వీట్స్ ద్వారా తెల్పుతూ గత ఏడాది సాధించిన బర్త్ డే ట్వీట్స్ 4.5 మిలియన్లను అధిగమించి ఈ సారి ఏకంగా 8.3 మిలియన్ల ట్వీట్స్ తో సరికొత్త చరిత్ర సృష్టించారు. అయితే ప్రస్తుతం ఇండియ మొత్తంలోనే ఇది అతిపెద్ద రికార్డు అని అంటున్నారు విశ్లేషకులు. ఇక గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా #HappybirthdayJanasenani హ్యాష్ ట్యాగ్ తో 7.4 మిలియన్ల ట్వీట్స్ తో ప్రధమ స్థానంలో నిలవగా, సూపర్ స్టార్ ఫ్యాన్స్ నిన్న దానిని బ్రేక్ చేయడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here