రణరంగం మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్ : రెబల్ స్టార్ ప్రభాస్

0
672

ఆకట్టుకునే విభిన్న చిత్రాల నటుడు శర్వానంద్ హీరోగా, కళ్యాణి ప్రియదర్శన్ మరియు కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా భిన్నమైన కథ కథనాలతో చిత్రాలను తెరకెక్కించడంలో మంచి పేరు సంపాదించిన సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం రణరంగం. 1990వ దశకం నాటి గ్యాంగ్ స్టర్ కథాంశం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్ మరొక్కసారి ఒక విభిన్నమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ ని టాలీవడ్ మాటలమాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మొన్న కాకినాడలో జరిగిన ఫంక్షన్ లో రిలీజ్ చేయడం జరిగింది. తన సినిమాల్లో ఎంతో కొంత ప్రత్యేకత ఉండేలా చూసుకునే శర్వా నటిస్తున్న ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తూ త్రివిక్రమ్ సినిమా యూనిట్ కి అల్ ది బెస్ట్ తెలిపారు.

ఈ చిత్రం 90వ దశకం, అలానే ప్రస్తుత కథల మిళితంగా సాగనున్నట్లు ట్రైలర్ ని బట్టి చూస్తే మనకు అర్ధం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ కు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సమయంలో మద్యపాన నిషేధం అమల్లోకి రావడం, అయితే మద్యాన్ని దొడ్డిదారిన నిల్వవుంచి, వాటిని ప్రజలకు అధిక ధరలకు అమ్ముదాం అని హీరో శర్వా డైలాగ్ చెప్పడం వంటివి ట్రైలర్ లో బాగున్నాయి. అలానే ట్రైలర్ మధ్యలో ఒక వ్యక్తిని చికెన్ ముక్కతో హీరో పొడవడం, ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏదైనా ఉందంటే అది డబ్బు ఒక్కటే అంటూ పలికే డైలాగ్స్ హీరో క్యారెక్టరైజెషన్ ని మనకు తెలియచేస్తాయి. ప్రస్తుతం యూట్యూబ్ లో దాదాపుగా రెండు మిలియన్ల వ్యూస్ కు చేరువ అవుతున్న ఈ ట్రైలర్, సినిమాపై అంచనాలు పెంచింది .

ఈ ట్రైలర్ పై నేడు రెబల్ స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందిస్తూ, చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని, డార్లింగ్ శర్వానంద్ కు మరియు రణరంగం సినిమా యూనిట్ మొత్తానికి తన తరపున అభినందనలు తెలిపుత్తో ఒక పోస్ట్ చేసారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈనెల 15న రిలీజ్ చేయనున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here