సూపర్ స్టార్ మహేష్ జన్మదిన వేడుకలు షురూ చేసిన అభిమానులు

0
1629

ఈ నెల 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు తన జన్మదినం జరుపుకోనున్నారు. ప్రతి ఏడాది ఆ రోజున అభిమానులు తమ అభిమాన హీరో పుట్టిన రోజుని ఘనంగా జరుపుకుంటారు. చాలా చోట్ల మహేష్ బాబు పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక సోషల్ మీడియా లో మహేష్ అభిమానులు చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం అభిమానులు, సినిమా ప్రేమికులు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో ఉన్న నటీ నటులు, దర్శకులు, మరియు ఇతర టెక్నీషియన్లు కూడా మహేష్ బాబు కి శుభాకాంక్షలు తెలుపుతారు.

ఇక ఈ డిజిటల్ యుగం లో హాష్ టాగ్ వేడుకలు ప్రాచుర్యం లో ఉన్న సంగతి తెలిసిందే. హ్యాపీ బర్త్ డే మహేష్ అనే హాష్ టాగ్ తో ఎక్కువ సంఖ్య లో ఆ రోజు తమ అభిమాన హీరో కి అత్యధిక సంఖ్యలో శుభాకాంక్షలు తెలుపుతారు.  సెలెబ్రేషన్స్ కోసం ఒక కామన్ డిస్ప్లే ఫోటో రెడీ చేసేసారు అభిమానులు.

ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర మరియు సంగీత దర్శకుడు థమన్ ఈ కామన్ డీ పీ ని ట్విట్టర్ లో అభిమానుల కోసం ఆవిష్కరించారు. విడుదల చేసిన గంట లో నే #SuperstarMaheshBDayCDP తో దాదాపు గా 170 వేల ట్వీట్స్ వచ్చాయట. సూపర్ స్టార్ జన్మదిన వేడుకల్ని ఘనంగా ప్రారంభించారు అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here