సెన్సార్ బోర్డు నుండి యు/ఏ సర్టిఫికెట్ పొందిన కింగ్ నాగార్జున మన్మధుడు-2…!!

0
559

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా, యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మన్మధుడు-2. ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్ వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి.

ట్రైలర్ లో నాగార్జున ను చూసిన వారందరూ ఆయన ఎంతో యంగ్ గా ఉన్నారని నాగ్, రకుల్ ల జోడి చాలా బాగుందని పొగడ్తలు కురిపిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం ఈ సినిమాకు మంచి ప్లస్ కానున్నాయి. యూరోప్ లో అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం విజువల్ ట్రీట్ గా రూపొందింది.

ఈ సినిమాకు సంబంధించి నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ బోర్డు నుండి యు/ఏ సర్ఫిటికెట్ సంపాదించిన ఈ సినిమాను ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here