ఏఎంబి సినిమాస్ లో సూపర్ స్టార్ మహేష్ ‘దూకుడు’ స్పెషల్ షో….!!

0
774

మరొక మూడు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు జరుపుకోనున్నారు. అయితే అప్పుడే ఆయన ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో హడావుడి షురూ చేసారు. ఇప్పటికే ఆయన బర్త్ డే కు సంబంధించి నిర్మాత అనిల్ సుంకర చేతుల మీదుగా రిలీజ్ చేసిన కామన్ డిస్ప్లే పిక్చర్ పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. #SuperstarMAHESHBdayCDP హాష్ టాగ్ తో 2 మిలియన్ ట్వీట్స్ చేసి ట్రేండింగ్ లో రికార్డు సృష్టించారు.

మహేష్ బర్త్ డే రోజున, సూపర్ స్టార్ , దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ దూకుడును మహేష్ బర్త్ డే కానుకగా ఏఎంబి సినిమాస్ లో ప్రదర్శించనున్నారు. ఇక వారి ప్రకటనతో ఒక్కసారిగా మహేష్ ఫ్యాన్స్ దూకుడు టికెట్స్ కోసం అప్పుడే బుకింగ్స్ మొదలెట్టేసారు. రెండు తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లోని సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ పెద్దఎత్తున పలు సామజిక, సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here