యాండ్రాయుడు కి పెదరాయుడు ప్రోత్సాహం

0
1196

సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్ర లో ఆగష్టు 10 న విడుదల అవుతున్న చిత్రం కొబ్బరి మట్ట. ఈ సినిమా కి సంబందించిన ప్రీ రిలీజ్ వేడుక ఈ రోజు హైదరాబాద్ లో ఘనం గా జరుగుతుంది. సాయంత్రం ఆరు గంటలకి సైబర్ కన్వెన్షన్ లో ఈ వేడుక నిర్వహించనున్నారు. ఈ సినిమా లో సంపూ రాయుడు, పెదరాయుడు, యాండ్రాయుడు గా కనిపించనున్నాడు. అయితే ఈ వేడుక కి మోహన్ బాబు ముఖ్య అతిధి గా విచ్చేయనున్నారు.

“మా ఆహ్వానాన్ని మన్నించి పెద్ద మనసు తో మా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్న ద రియల్ పెదరాయుడు కలెక్షన్ కింగ్ పద్మశ్రీ మోహన్ బాబు గారికి మా పాదాభివందనాలు.” అని చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ మీద పేర్కొంది. అంతే కాకుండా “నాలాంటి ఒక చిన్న నటుడిని అడిగిన వెంటనే మా ప్రిరిలీజ్ ఫంక్షన్ కి ఆశీర్వదించటానికి విచ్చేస్తున్న మా రియల్ పెదరాయుడు మోహన్ బాబు గారికి నా పాదాభివందనం.” అని సంపూర్ణేష్ బాబు ట్విట్టర్ లో ప్రకటించాడు.

మోహన్ బాబు తో పాటు సందీప్ కిషన్ కూడా ఈ సినిమా ప్రీ రికేజ్ వేడుక కి హాజరు కానున్నాడు. ఈ సినిమా ఈ నెల 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here