పాయల్ రాజ్‌పుత్ `RDX లవ్` ఫస్ట్ లుక్‌ లాంచ్ చేసిన విక్టరీ వెంకటేశ్

1
511

పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం `RDX లవ్`. నరేశ్, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, నాగినీడు, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్ర ధారులు. శనివారం ఈ సినిమా ఫస్ట్ ‌లుక్‌ని విక్టరీ వెంకటేశ్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ చాలా ఇంప్రెసివ్‌గా ఉందని, సినిమా చాలా పెద్ద హిట్ కావాలంటూ విక్టర్ వెంకటేశ్ ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేశ్‌తో పాటు `పవర్` డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ), చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్ లుక్ విడుదల చేసి యూనిట్‌కి అభినందనలు తెలిపిన వెంకటేశ్‌కి హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, నిర్మాత సి.కల్యాణ్ థ్యాంక్స్ చెప్పారు.

శంకర్ భాను రచనా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రామ్ మునీష్ సమర్పణలో హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రధన్ సంగీతం, సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Victory Venkatesh Launches RDX Love First Look – Pics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here